హైదరాబాద్: పోలీసుల తీరుపై ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అసహనం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమా సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున్ ను అరెస్టు చేసేందుకు చిక్కడపల్లి పోలీసులు ఆయన నివాసానిక వెళ్లారు. అయితే, బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తమతో రావాలని పోలీసులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఉన్నపళంగా రమ్మంటే ఎలా.. బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వరా? అంటూ ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు.
ఇక, పోలీసులు రావడంతో అల్లుఅర్జున్ భార్య స్నేహారెడ్డి కొంత ఆందోళనకు గురయ్యారు. దీంతో తన భార్యకు బన్నీ ధైర్యం చెప్పారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అనంతరం అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు. అల్లుఅర్జున్ రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.