Monday, January 6, 2025

అల్లుఅర్జున్ అరెస్టు.. ఇందులో నా జోక్యం ఉండదు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ అరెస్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.చట్టం ముందు అందరూ సమానమే అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో ఒకరు మృతి చెందడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు, అల్లుఅర్జున్ కు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించారు పోలీసులు. ప్రస్తుతం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చేందుకు తరలిస్తున్నారు. కాగా.. అల్లుఅర్జున్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను హైకోర్టు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News