Thursday, January 16, 2025

‘మర్దానీ 3’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా..

- Advertisement -
- Advertisement -

రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌ఫై రూపొందిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మర్దానీ’. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు అవుతుంది. 2014లో ఈ చిత్రం విడుదలైంది. 2019లో దీనికి సీక్వెల్‌ను రూపొందించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ దగ్గర రాణించాయి. మర్దానీ 2 రిలీజ్ యానివర్సరీ సందర్భంగా మర్దానీ 3కి సంబంధించిన మేకింగ్ వీడియోను యష్ రాజ్ ఫిలిమ్స్ విడుదల చేసింది. ఇందులో రాణి ముఖర్జీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో నటించారు. ఈ సందర్భంగా రాణి ముఖర్జీ

మాట్లాడుతూ “2025 ఏప్రిల్ నుంచి మర్దానీ3 చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించబోతున్నామని తెలియజేయటానికి ఎంతో సంతోషంగా ఉంది. మర్దానీ 3 సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటం ఎంతో గర్వంగా ఉంది”అని అన్నారు. రైల్వే మెన్ ఫేమ్ ఆయుష్ గుప్తా మర్దానీ 3 స్క్రిప్ట్‌ను అందించారు. అభిరాజ్ మినవాలా… మర్దానీ 3 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాండ్ బాజా భారత్, గూండే, సుల్తాన్, జబ్ తక్ హై జాన్, టైగర్ 3 చిత్రాలకు అభిరాజ్ అసిస్టెంట్‌గా వర్క్ చేశారు. ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో రూపొందుతోన్న వార్ 2 చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గానూ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మర్దానీ 3ని తెరకెక్కించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News