- Advertisement -
హైదరాబాద్: నటుడు అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు తరలిస్తున్నారు. అల్లు అర్జున్‌ను పలువురు దర్శకులు, నిర్మాతలు, నటులు పరామర్శిస్తున్నారు. అర్జున్‌ను మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, సోదరుడు నాగబాబు పరామర్శించారు. అల్లు అర్జున్ ను చూడగానే సురేఖ బన్నీని హత్తుకొని బావోద్వేగానికి గురయ్యారు. అల్లు అర్జున్ అరెస్టు చేసిన తరువాత చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం విధితమే. చంచల్‌గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో శుక్రవారం సాయంత్రం అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -