- Advertisement -
ఝరాసంగం: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వవ్యహరించిన పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం తుమ్మన్ పల్లి పంచాయతీ కార్యదర్శి జాకీర్ ఖాన్ సస్పెండ్ చేస్తునట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో సుధాకర్ పేర్కొన్నారు. తుమ్మన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న రైస్ మిల్ ను కూల్చివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. దీంతో కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
- Advertisement -