Monday, December 16, 2024

నేనెక్కడికి పారిపోలేదు: మోహన్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: పోలీసులకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ వచ్చిన వార్తలపై నటుడు మంచు మోహన్‌బాబు స్పందించారు. తనపై వచ్చిన తప్పుడు వార్తలను ఖండించారు. మెరుగైన చికిత్స కోసం ఇంట్లోనే వైద్యం పొందుతున్నానని.. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తాను పోలీస్ స్టేషన్ కు వచ్చి తన తుపాకిని సరెండర్ చేస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానన్న పోలీసులకు మోహన్‌బాబు చెప్పారు. కాగా, ఆస్పత్రి నుంచి డిచార్జ్ అయిన తర్వాత మోహన్ బాబు కనిపించడం లేదని, ఆయన తన నివాసంలో కూడా లేరని వార్తలు వచ్చాయి. నిన్నటి నుంచి పోలీసులకు అందుబాటులో లేకుండా పోయిన మోహన్‌బాబు కోసం ఐదు పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News