Saturday, December 21, 2024

ఘనంగా సింధు, వెంటకసాయి నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు, ప్రముఖ వ్యాపారవేత్త వెంకట దత్త సాయి నిశ్చితార్థ వేడుకగా ఘనంగా జరిగింది. సింధు, వెంకటసాయిల వివాహం ఈ నెల 22న జైపూర్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో డిసెంబర్ 24న వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే సింధు, వెంకటసాయి నిశ్చితార్థ వేడుకగా శనివారం ఘనం జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోను సింధు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఈ క్రమంలో సింధు పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు, మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు’ అనే లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్‌కు చెందిన కోట్‌ను క్యాప్షన్‌గా జోడించింది. కాగా, సింధు భారత మహిళల బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా కొనసాగుతోంది. కెరీర్‌లో రెండు సార్లు ఒలింపిక్ పతకాన్ని గెలిచి చరితృ సృష్టించింది. అంతేగాక ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News