Thursday, January 16, 2025

బెంగళూరు టెక్కీ ఆత్మహత్య కేసు.. భార్య, అత్త, బావమరిది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో అతని భార్య నికిత, ఆమె తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. నికితను గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి, సోదరుడిని ప్రయాగ్‌రాజ్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తీసుకువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

అంతకుముందు శుక్రవారం, బెంగళూరు సిటీ పోలీసులు అతని భార్య నికితా సింఘానియాకు సమన్లు ​​జారీ చేసి మూడు రోజుల్లోగా హాజరు కావాలని కోరారు. సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీత్ కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బెంగళూరు సిటీ పోలీస్ బృందం ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఖోవా మండి ప్రాంతంలోని సింఘానియా నివాసానికి ఉదయం 11 గంటలకు వెళ్లగా ఎవరూ లేకపోవడంతో నోటీసును గేటుకు అతికించింది. నిఖితా సింఘానియా తన భర్త అతుల్ సుభాష్ మరణానికి సంబంధించిన పరిస్థితులపై విచారణ కోసం మూడు రోజుల్లోగా బెంగుళూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లోని విచారణ అధికారి ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

కాగా, 34 ఏళ్ల టెక్కీ.. తన నుంచి విడిపోయినా భార్య, ఆమె కుటుంబం వేధిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. అతుల్ తనకు ఎదురైన కష్టాలను వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు సంచలనం సృష్టించింది. వేధింపులకు గురిచేస్తున్నట్లు 24 పేజీల సూసైడ్ నోట్ కూడా రాశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News