- Advertisement -
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తన కుటుంబంతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కసలాట ఘటన కేసులో అరెస్టై జైలు నుంచి వచ్చిన తర్వాత తొలిసారి మెగాస్టార్ చిరంజీవిని బన్నీ కలుస్తున్నారు. ఆదివారం ఉదయం తన భార్య స్నేహారెడ్డి, పిల్లలుతో కలిసి బన్నీ చిరు నివాసానికి వెళ్లారు. ఈ ఘటనపై చిరంజీవికి బన్నీ వివరించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, శనివారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి వచ్చిన అల్లుఅర్జున్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. మరోవైపు, తొక్కిసలాట ఘటనలో ఓ మహిల మృతి చెందగా.. ఆమె కొడుకు ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉన్నాడు. బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో బాలుడికి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -