Tuesday, April 1, 2025

జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన మోహన్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మీడియా న్యాయపోరాటానికి నటుడు మోహన్‌బాబు దిగి వచ్చారు. జర్నలిస్టు రంజత్ కు బహిరంగ క్షమాపణ చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ ను పరామర్శించారు. రంజిత్‌, ఆయన కుటుంబసభ్యులు, మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పారు.  న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా జర్నలిస్టు రంజిత్ పై మోహన్ బాబు దుర్భాషలాడుతూ మైకులు లాక్కొని దాడి చేసిన విషయం తెలిసిందే. మంచు కుటుంబంలో గొడవలు జరగడంతో ఆ వార్తను కవర్ చేయడానికి పలువురు జర్నలిస్టులు అక్కడికి వెళ్లారు. దీంతో నటుడు మోహన్ బాబు మైకులు లాక్కొని జర్నలిస్టులపై దాడి చేసిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News