Monday, December 16, 2024

టెకీ అతుల్ సుభాష్ భార్య సింఘానియా అరెస్టు

- Advertisement -
- Advertisement -

పోలీసుల నిర్బంధంలో ఆమె తల్లి, సోదరుడు కూడా
ముగ్గురికీ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధింపు
బెంగళూరు : ఇటీవల ఆత్మహత్యచేసుకున్న టెక్ ఎగ్జిక్యూటివ్ అతుల్ సుభాష్ నుంచి విడిపోయిన భార్యతో సహా ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. సుభాష్ ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భార్య నికితా సింఘానియాను హర్యానా గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి నిషా సింఘానియాను, సోదరుడు అనురాగ్ సింఘానియాను ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.

శనివారం ఉదయం అరెస్టు చేసిన ఆ ముగ్గురిని బెంగళూరు తీసుకువచ్చినట్లు, ఒక స్థానిక కోర్టులో హాజరు పరచిన అనంతరం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు ఆయన తెలియజేశారు. అయితే, నిషా సింఘానియా, అనురాగ్ సింఘానియా అరెస్టు గురించి బెంగళూరు పోలీసులు తమకు సమాచారం ఇవ్వలేదని ప్రయాగ్‌రాజ్ నుంచి సీనియర్ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఈ నెల 9న ఆగ్నేయ బెంగళూరులోని మున్నెకోలలులోని తన ఇంటిలో ఉరికి వేలాడుతూ కనిపించారు.

‘తప్పుడు’ కేసులు, ‘నిరవధిక వేధింపులు’ ద్వారా వారు తనను ఆత్మహత్యకు పురికొల్పారని తన భార్య, అత్తవారిని నిందిస్తూ సుదీర్ఘ వీడియోలు, నోట్‌లు వదిలారు. సుభాష్ భార్యను. అత్తగారిని, బావమరిదిని పట్టుకున్నట్లు, వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు, దర్యాప్తు జరగనున్నట్లు కర్నాటక హోమ్ శాఖ మంత్రి జి పరమేశ్వర బెంగళూరులో విలేకరులతో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News