దేశంలో మొట్టమొదటిది
న్యూఢిల్లీ : శాస్త్రీయ పరిశోధనకు దన్నుగా ఉండడం లక్షంగా జనాభా ఆధారిత జీవసంబంధ నమూనాల నిధి అయిన మధుమేహ బయోబ్యాంక్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) మద్రాసు డయాబెటిస్ రీసర్చ్ ఫౌండేషన్ (ఎండిఆర్‌ఎఫ్) సహకారంతో చెన్నైలో తొలిసారిగా ఏర్పాటు చేసింది. ఐసిఎంఆర్ అనుమతితో శాస్త్రీయ అధ్యయనాల్లో తోడ్పడేందుకు జీవ సంబంధ పదార్థాల నమూనాలు సేకరించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడంచెన్నై ఎండిఆర్‌ఎఫ్‌లో ఏర్పాటు చేసిన బయోబ్యాంక్ లక్షం.
మధుమేహానికి కారణాలు, భారతీయ తరహా మధుమేహంలో మార్పులు. సంబంధిత లోపాలపై పరిశోధనకు బయోబ్యాంక్ వీలు కల్పిస్తుందని ఎండిఆర్‌ఎఫ్ చైర్మన్, డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ చైర్మన్ డాక్టర్ వి మోహన్ తెలియజేశారు. ఐసిఎంఆర్ నిధులతో జరిపిన రెండు అధ్యయనాల నుంచి రక్తం నమూనాలు బయోబ్యాంక్‌లో ఉన్నాయి. బయోబ్యాంక్ ఏర్పాటు ప్రక్రియ సుమారు రెండు సంవత్సరాల క్రితం మొదలైంది.