Monday, December 16, 2024

క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్లినిక్‌ను ప్రారంభించిన యశోద ఆస్పత్రి

- Advertisement -
- Advertisement -

తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం

ప్రత్యేక క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) క్లినిక్‌ను ప్రారంబించిన యశోద హాస్పిటల్స్
మూత్రపిండాల వ్యాధులపై ప్రజలకు అవగాహన తప్పనిసరి అంటోన్న నెఫ్రాలజిస్ట్ లు

మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోవడం ఆందోళనకరం. మన దేశ జనాభాలో 17% మంది ప్రజలు మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకోసం క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) క్లినిక్ ను ఆదివారం పవిత్ర జగద్గురువు శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామీజీతో కలిసి యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరుకంటి రవీందర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. దేవదాస్, మాజీ పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొన్నారు.

Kidney disease

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరుకంటి రవీం దర్ రావు మాట్లాడుతూ భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల భారం పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్ష ల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు. వీరిలో కేవలం ఇరవై వేల మంది రోగులకు మాత్రమే కిడ్నీ మార్పిడి అందించ బడుతుంది. మిగిలిన వారు డయాలసిస్‌లో ఉండి, మార్పిడి కోసం వేచి ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో (తెలం గాణ, ఆంధ్రప్రదేశ్) జనాభాలో 20% కంటే ఎక్కువ మందిలో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) ప్రాబల్యం పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకోసం ఒక ప్రత్యేక క్లినిక్ ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్. రాజ శేఖర చక్రవర్తి మాట్లాడుతూ క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) ప్రమాదంలో ఉన్న వారందరూ ఈ క్లినిక్‌లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు.

sunburn effect on kidneys

సీనియర్ నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్‌తో సహా ప్రోటోకలైజ్డ్ కేర్, డైటీషియన్ అత్యాధునిక పరికరాలు, మందులను ఉపయోగించి సికెడి నిర్వహణకు సలహా ఇస్తారు. సికెడి ప్రమాదం ఉన్నవారు డయాబెటిక్ మెల్లిటస్, హైపర్ టెన్షన్, కిడ్నీ స్టోన్స్, దీర్ఘకాలంగా మందులు వాడుతున్న రోగులు, (నొప్పి నివారిణి యాంటీబయాటిక్స్ వంటివి), ఊబకాయం ఉన్న వ్యక్తులు, సికెడి యొక్క కుటుంబ చరిత్ర ఉన్న రోగులు కోసం ఈ ప్రత్యేక క్లినిక్ ఏర్పా టు చేసినట్లు తెలిపారు. రోగికి త్వరగా ఈ క్లినిక్ కు వచ్చినట్లయితే, క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) యొక్క పురోగతిని నివారించడం సాధ్యమవుతు ందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News