సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో ఖాళీల భర్తీ
వివిధ విభాగాల్లో 179 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
జనవరి 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సిడబ్లుహెచ్సి)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీకి సిడబ్లుహెచ్సి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 179 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జనవరి 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.
పోస్టులు : మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
ఖాళీల సంఖ్య : 179
అర్హతలు : పోస్టును బట్టి డిగ్రీ, బికామ్, సిఎ, పిజి, ఎంబిఎ
వయసు : గరిష్ఠంగా 30 ఏళ్లకు మించకూడదు
ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన, వైద్య పరీక్ష, ఇంటర్వూ
దరఖాస్తు రుసుము : జనరల్/ ఒబిసి పురుష అభ్యర్థులకు రూ. 1350, ఎస్సి, ఎస్టి, దివ్యాంగులు, మహిళలకు రూ. 500
జీతం : నెలకు రూ. 29000 నుంచి రూ. 180000 వరకు.