Monday, December 16, 2024

దుబాయిలో స్పెషల్ టీ…. ఖరీదు కేవలం రూ. 1.14 లక్షలు

- Advertisement -
- Advertisement -

వెండి కప్పులో బంగారం పూతతో గోల్డ్ కడక్ చాయ్
టీ తాగిన తరువాత కప్పు తీసుకువెళ్లవచ్చంటున్న యాజమాన్యం
దుబాయిలో భారత సంతతి వ్యాపారవేత్త రెస్టారెంట్‌లో ఆఫర్

దుబాయి : కప్పు టీ ఖరీదు మహా అయితే పదిహేను రూపాయలు. అదే కాస్త ఖరీదైన రెస్టారెంట్‌లో వందో, రెండు వందలో ఉంటుంది. స్టార్ హోటళ్లలో వేలల్లో ఉంటుందేమో గాని దుబాయిలో మాత్రం కప్పు టీ రూ. 1.14 లక్షలు. అవును. అక్షరాలా లక్షా పద్నాలుగు వేల రూపాయలు మాత్రమేనట. ఇంత ఖరీదా? టీని బంగారంతో తయారు చేస్తున్నారా ఏమిటి అనుకుంటున్నారా? నిజమే. బంగారంతోనే తయారు చేస్తున్నారు.

స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన కప్పులో బంగారు పూత (24 క్యారట్ బంగారంతో టాపింగ్)తో ఈ టీని స్పెషల్‌గా సర్వ్ చేస్తారు. ఒక్కొక్క సిప్‌లో వేడి వేడి చాయ్‌తో పాటు బంగారాన్ని తాగేయవచ్చు. టీ తాగిన తరువాత కప్పును అక్కడే వదలివేయకుండా ఎంచక్కా ఇంటికి తెచ్చేసుకోవచ్చు. దుబాయిలోని బోహో కేఫ్ ఈ గోల్డ్ కడక్ చాయ్‌ను సర్వ్ చేస్తోంది. భారత సంతతికి చెందిన సుచేత శర్మ ఈ కేఫ్‌ను నడిపిస్తున్నారు.

తమ కస్టమర్ల కోసం, వారి హోదాకు తగినట్లుగా స్పెషల్‌గా ఈ టీని సర్వ్ చేస్తున్నామని సుచేత చెప్పారు. ఈ టీతో పాటు గోల్డ్ సూవెనీర్ కాఫీ (రూ. 1.09 లక్షలు) కూడా తమ కేఫ్‌లో అందుబాటులో ఉందని ఆయన తెలియజేశారు. కాగా, బోహో కేఫ్‌లో సర్వ్ చేసే ఈ స్పెషల్ టీని ఒక ఫుడ్ వ్లాగర్ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. దీనితో ఆ వీడియో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News