లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
నేడు దిగువసభలో బిల్లుల ప్రవేశం లేనట్టే
వారాంతంలో స్పష్టత వచ్చే అవకాశం
ఈ నెల 20వ తేదీతో ముగియనున్న
పార్లమెంట్ సమావేశాలు
న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల బిల్లులపై కేంద్ర ప్ర భుత్వం వెనక్కి తగ్గినట్లు కనపడుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ (129వ) సవరణ , కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లులను సోమవారంనాడు కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడతారని ఇటీవల ప్రకటించారు. ఆ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచిన కేంద్ర ప్రభు త్వం తాజాగా వాటిని వెనక్కి తీసుకుంది. సవరించిన జాబితాలో ఆదివారంనాటికి అవి కనిపించక పోవడంతో మోడీ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు స్పష్టమైంది. మరోవైపు శుక్రవారంనాటితో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’కు సంబంధించిన బిల్లుల ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసిందని, ముందుగా ఆర్థికపరమైన కార్యకలాపాలను సభ పూర్తి చేస్తుందని ఆదివారంనాడు అధికార వర్గాలు వెల్లడించాయి.
సోమవారానికి నిర్ణయించిన అనుబంధ పద్దుల మొ దటి బ్యాచ్‌ను సభ ఆమోదించిన తరువాత ఈ వారం చివర్లో సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లులు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరికొన్ని వర్గాలు మాత్రం ఆ వార్తలను కొట్టిపడేస్తున్నా యి. అయితే లోక్‌సభ స్పీకర్ అనుమతితో ‘అనుబంధ కార్యకలాపాల జాబితా’ ద్వారా చివరి ని మిషంలో పార్లమెంట్‌కు శాసన సంబంధిత అ జెండాలో ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకురావచ్చు. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లుల ను గత వారమే సభ్యులకు పంపిణీ చేశారు. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ అధికరణాన్ని చేర్చాల్సి వస్తోంది. పార్లమెంట్ ప దవీ కాలం మార్పునకు ఆర్టికల్ 83ఎ, శాసనసభల కాలపరిమితి సవరణకు 172ను, ఎన్నికల నిబంధనల మార్పునకు 327ఎ నిబంధనలు సవరించాల్సి వస్తోంది.