Monday, December 16, 2024

భూమి లేని నిరుపేదకు రూ.12000

- Advertisement -
- Advertisement -

రైతులు, కూలీలకు ఏటా చెల్లింపు
ఈనెల 28న లాంఛనంగా కొత్త
పథకం ప్రారంభం ప్రతి ఏటా
రెండు విడతలుగా లబ్ధిదారుల
ఖాతాలలో జమ సంక్రాంతి
పండుగ రోజు రైతు భరోసా
ప్రారంభం రాష్ట్ర అప్పులపై
అసెంబ్లీలో చర్చకు బిఆర్‌ఎస్
సిద్ధమా? పదేళ్లలో
రూ.7,11,911 కోట్ల అప్పులు
చేసిన గత సర్కార్ మా దగ్గర
పక్కా లెక్కలు ఉన్నాయ్ రైతుల
కోసం ఒక ఏడాదిలో రూ.50,953
కోట్లు ఖర్చు అప్పులు, వడ్డీల కింద
రూ.66,782 కోట్లు చెల్లించాం
11 నెలల్లో మేం చేసిన అప్పు
రూ.54,118కోట్లు ఖమ్మంలో
డిప్యూటీ సిఎం మల్లు భట్టి
విక్రమార్క వెల్లడి

మన తెలంగాణ/ఖమ్మంబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్బంగా మరో కొ త్త పథకాన్ని అధికారికంగా ప్రకటించింది. అసెం బ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు భూమిలేని నిరుపేద రైతులకు, కూలీలకు ఏటా రూ. 12 వేలు చెల్లించే పథకానికి ఈనెల 28న శ్రీకారం చు ట్టబోతోంది. ఈమేరకు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమం త్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలో అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఆవిర్బావ దినోత్సవమైన ఈనెల 28న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. భూమి లేని నిరుపే ద రైతులు, వ్యవసాయ కూలీలను గుర్తించి వారి అకౌంట్లలో ప్రతి ఏటా రెండు విడతలుగా రూ. 12 వేలు జమ చేస్తామని చెప్పారు.

దేశ స్వాతం త్రం కోసం ఏర్పడిన అఖిల భారత కాంగ్రెస్ ఆవిర్భావం రోజైన డిసెంబర్ 28న రాష్ట్రంలోని నిరుపేద కూలీల కుటుంబాలకు మొదటి విడతగా 6 వేల రూపాయలను ప్రజా ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. అదేవిధంగా రైతు భరోసా చెల్లించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతుబంధు డబ్బులు ఇస్తామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల రుణాలు ఉన్న రైతులందరికీ కేవలం 15 రోజుల్లోనే వారి ఖాతాల్లో నేరుగా రూ.21 వేల కోట్లు జమ చేసి దేశానికి ఆదర్శంగా తమ ప్రభుత్వం నిలిచిందన్నారు. ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా రూ.50, 953 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు.

పదేళ్లు అధికారంలో ఉండి బిఆర్‌ఎస్ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. బిఆర్‌ఎస్ నాయకులకు గాలి మాటలు చెప్పడం ఉన్నది లేన ట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడమే తెలుసునని అన్నారు. గత పదే ళ్ళ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులో అసెంబ్లీ లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దీ నికి బిఆర్‌ఎస్ పార్టీ సిద్ధ్దమేనా? అని డిప్యూటీ సి ఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. రాష్ట్ర ఆర్థిక, అప్పుల పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ప్ర చారం చేస్తున్నదని మండిపడ్డారు. గత పదేళ్ళ కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రూ.7,11,911 కోట్ల అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని కానీ వాటిని తాము అప్పులు చేసినట్లుగా ఆ పార్టీ దుష్ప్రచారం చేయడం తగదన్నారు. గత సర్కార్ తినడానికి అప్పులు చేస్తే..

వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు తమ ప్రభుత్వం అప్పులు చేసిందని స్పష్టం చేశారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేవలం 11నెలల కాల వ్యవధిలో రూ.54,118 కోట్లు అప్పులు చేయగా గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకు మొత్తం రూ.66,782 కోట్లు బ్యాంకులకు కట్టామన్నారు.మొత్తం రూ.7,11,911 కోట్ల అప్పుల భారాన్ని గత బిఆర్‌ఎస్ పాలకులు ప్రజలపై మోపి తగుదునమ్మ అంటూ కెటిఆర్, హరీశ్‌రావు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్ర అప్పుల గురించి పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా రూ.50,953 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మల్లు భట్టి వివరించారు. గత ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని పూర్తిగా విస్మరించగా ప్రజా ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయలు చెల్లించిందని వెల్లడించారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రజా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను వారం రోజుల వ్యవధిలోనే రైతులకు చెల్లిస్తున్నామని చెప్పారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని తెలిపా రు. సన్న వడ్లపై క్వింటాకు ఇస్తున్న రూ.500 బోనస్ ద్వారా ప్రతి ఎకరాకు పది నుంచి పదిహేను వేల రూపాయలను అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలో నాలుగు కొత్త విమానాశ్రయాలు

రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ కోసం ప్రజా ప్రభుత్వం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతా ల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తుందని భట్టి ప్రకటించా రు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఫ్యూ చర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీని ప్రక్షాళన చేసి పునర్జీవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్ర యత్నం చేస్తున్నదని వెల్లడించారు. అన్ని జిల్లాలను కలుపు తూ రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు అందిస్తామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మాజీ ఎంఎల్‌సి పోట్ల నాగేశ్వర్ రావు, కాంగ్రెస్ నా యకులు పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య , కార్పొరేటర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News