- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు విడుదల చేస్తున్నారని..కానీ సర్పంచులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రూ.691 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. దీనికి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.
గత ప్రభుత్వమే ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంటే బాగుండేదని చురకలంటించారు. బిఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితిగా మారిందని దుయ్యబట్టారు.సర్పంచ్ ల బకాయిలు తమ ప్రభుత్వానికి బిఆర్ఎస్ వారసత్వంగా ఇచ్చిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెలా రూ.274 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చామని హరీశ్ చెప్పారు.
- Advertisement -