గబ్బా టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. వర్షం కారణంగా మూడో రోజు కేవలం కేవలం 33 ఓవర్ల ఆట మాత్రేమే సాధ్యమైంది. సోమవారం ఓనర్ నైట్ స్కోరు 405/7తో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. రెండో బంతికే యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్ మన్ గల్(1), విరాట్ కోహ్లీ(3)లు కూడా వెంట వెంటనే ఔటై తీవ్రంగా నిరాశపర్చారు.
ఈ క్రమంలో పలుసార్లు వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేశారు. తర్వాత వర్షం తగ్గడంతో తిరిగి ఆటను ప్రారంభించారు. 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఆదుకుంటాడని భావించారు. అయితే, అతను కూడా 9 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో ఓపెనర్ కెఎల్ రాహుల్..ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుక్కొంటూ క్రీజులో నిలబడ్డాడు. పంత్ ఔటైన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజలోకి వచ్చాడు. ఈ క్రమంలో మళ్లీ వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోడంతో ఆటను ముగిస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఇక, ఆట ముగిసేసమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(33), రోహిత్(0)లు ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 394 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.