- Advertisement -
హైదరాబాద్: మంచు కుటుంబంపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. ఇటీవల మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ ల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు తమ ప్రాణాలకు ప్రమాదం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మంచు ఫ్యామిలీ రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
తాజాగా మంచు ఫ్యామిలీ వివాదంపై స్పందించిన రాచకొండ సీపీ.. మంచు కుటుంబంపై మూడు కేసులు నమోదయ్యాయని… వాటిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. లీగల్‌గా ఏది చేయాలో అది చేస్తామన్నారు. మోహన్‌బాబుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని.. అయితే, ఈ నెల 24 వరకు మోహన్‌బాబు టైం అడిగారని తెలిపారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి అరెస్ట్ చేయలేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
- Advertisement -