Tuesday, December 17, 2024

జార్జియా రెస్టారెంట్‌లో 12 మంది భారతీయులు మృతి

- Advertisement -
- Advertisement -

జార్జియాలోని పర్వతప్రాంత రిసార్ట్ గుడౌరిలో ఒక రెస్టారెంట్‌లో 12 మంది భారత జాతీయులు విగతజీవులుగా కనిపించారని తిబిలిసిలోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రాథమిక పరీక్షలో మృతదేహాలపై గాయాల చిహ్నాలు గానీ, దౌర్జన్యం జరిగిన సంకేతాలు గానీ కనిపించలేదని జార్జియా దేశీయాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వారంతా కార్బన్ మోనాక్సైడ్ విషవాయువుతో మరణించారని పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. 12 మంది మృతులూ భారత జాతీయులని తిబిలిసిలోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. అయితే, 11 మంది విదేశీయులని, ఒకరు తమ పౌరుడని జార్జియా దేశీయాంగ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో వివరించింది.

ఒక భారతీయ రెస్టారెంట్ ఉద్యోగులైన వారందరి మృతదేహాలు భవనం రెండవ అంతస్తులోని బెడ్‌రూమ్‌లలో కనిపించాయని మంత్రిత్వశాఖ తన ప్రకలనలో తెలియజేసింది. ‘జార్జియా గుడౌరిలో 12 మంది భారత జాతీయుల మృతి గురించి దౌత్య కార్యాలయానికి ఇప్పుడే తెలిసింది. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. ప్రాణాలు కోల్పోయిన భారత జాతీయుల వివరాలు పొందేందుకు స్థానిక అధికారులను సంప్రదిస్తున్నాం. సాధ్యమైన సహాయం ఇవ్వగలం’ అని తిబిలిసిలోని భారత దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, బెడ్‌రూమ్‌లను ఆనుకుని ఒక ఇన్‌డోర్ ప్రాంతంలో విద్యుత్ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలచిపోయిన తరువాత జనరేటర్‌ను ఆన్ చేశారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News