Tuesday, December 17, 2024

జమిలి ఎన్నికలను వ్యతిరేకించండి:స్టాలిన్

- Advertisement -
- Advertisement -

జమిలి ఎన్నికల చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకీకృతం కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పిలుపునిచ్చారు. ‘ఎన్నికల సంస్కరణల ముసుగులో జమిలి ఎన్నికలను రుద్దనున్నారు. దీనిని వ్యతిరేకించి రాజ్యాంగాన్ని, ఇండియాను కాపాడండి’ అని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.ఈ కీలక చట్టాన్ని ఆమోదింపజేసేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్రానికి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. దేశ ప్రగతి కుంటుపడడం నుంచి, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి నిస్సంకోచంగా ఈ ప్రయత్నం చేస్తోంది’ అని స్టాలిన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఇండియా కూటమి ఫెడరల్ వ్యతిరేక, ఆచరణ యోగ్యం కాని ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అది దేశాన్ని ఏకీకృత విధానంలోకి నెట్టేయగలదు. దేశ భిన్నత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయగలదు.

దేశంలో అధ్యక్ష తరహా పాలన తేవడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పనిచేస్తోంది. బిజెపి ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లు ఆమోదిస్తే, అమలుచేస్తే…సమయానికి ఎన్నికలు నిర్వహించాలన్న అంశంలో ఎలాంటి అడ్డు, అదుపు ఉండదు. మన రాజ్యాంగ నిర్మాతలు దేశం అరాజకం, నిరంకుశత్వంలో పడిపోకుండా ఉండేలా రాజ్యాంగాన్ని రచించారు. బిజెపి విధానాలు ఆమోదిస్తే ప్రాంతీయ సెంటిమెంట్, భిన్నత్వం దెబ్బతింటాయి. రాష్ట్ర ఎన్నికల ప్రాముఖ్యత దెబ్బతింటుంది. కనుక శాయశక్తుల ఎన్నికల సంస్కరణలను అన్ని ప్రజాస్వామ్య శక్తులు వ్యతిరేకించాలి, దేశాన్ని కాపాడాలి’ అని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫాలో నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఉభయ సభల సంయుక్త కమిటీకి రిఫర్ చేయనున్నారు. కేంద్ర కేబినెట్ గత వారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న మీమాంసతో దానిని ప్రస్తుతానికి వదిలేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News