45.57శాతం మంది హాజరు
టిడిపి, చంద్రబాబుపై ప్రశ్నలు
కెసిఆర్, సోనియా, వైఎస్‌ఆర్‌లపైనా
క్వశ్చన్స్ పురిటినొప్పులతో పరీక్ష
రాసిన గర్భిణి, ఆమె కోసం సిద్ధంగా
108 వాహనం ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్/నాగర్‌కర్నూల్/పటాన్‌చెరు : రాష్ట్రంలో గ్రూప్ -2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. రెండో రోజు ఉద యం జరిగిన పేపర్3 పరీక్షకు 2,51,738 మంది (45.62 శాతం), మధ్యాహ్నం జరిగిన పేపర్4కు 2,55,468 మంది (45.57 శా తం) హాజరయ్యారు. పరీక్షకు హాజరయ్య అ భ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా రు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు అ భ్యర్థులను తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నా రు. పరీక్షా కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 144వ సెక్షన్ అమలు చేశారు. ఆదివారం పేపర్ 1 పేపర్ 2 పరీక్షలు జరిగాయి. సోమవారం ఉ దయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్ 3 పరీక్ష జరుగగా, మధ్యాహ్నం 3 గం టల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 4 పరీక్షలు జరిగాయి.
ఉదయం జరిగిన పేపర్ 3 (ఎకానమీ అండ్ డవలప్‌మెంట్) ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పేపర్ 4( తెలంగాణ ఉద్యమ చరిత్ర)లో ప్రతి అంశం క వర్ అయ్యేలా ప్రశ్నల సరళి ఉందని పేర్కొన్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమాలు, వివిధ కమిటీలు, వివిధ ఉద్యమకారుల గురించి, వి విధ సంస్ధల గురించి, వివిధ పార్టీల గురించి, ఉద్యమ గేయాలపై, విప్లవ సంస్థల ప్రస్థానం, కార్మిక సంస్థల ప్రస్థానం, రైతు ఉద్యమాలు, నిజాం పాలన, తెలంగాణకు జరిగిన అన్యాయాలపైన, గద్దర్, విమలక్క గేయాలపై, ప్రొ.జయశంకర్‌లపై ప్రశ్నలు వచ్చాయని అన్నారు. పేపర్ 4 ప్రశ్నాపత్రం కొంత అనుకూలంగా ఉందని అభ్యర్థులు తెలిపారు.
చంద్రబాబుపై ప్రశ్నలు
గ్రూప్ 2 పరీక్షలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై కొన్ని ప్రశ్నలు అడిగారు. నిజాం సాగర్, కడెం ప్రాజెక్టులు ఎవరి పాలనలో నిర్మించారు..?, చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ తయారుచేసిన అంతర్జాతీయ సంస్థ ఏదీ..? వంటి ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఎన్‌టిఆర్, వైఎస్‌ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలపై.. పలు అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. కెసిఆర్, సోనియా గాంధీ, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలపై ప్రశ్నలు అడిగారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఓ ప్రశ్న వచ్చింది.
పురిటి నొప్పులతో పరీక్ష రాసిన నిండు గర్భిణీ
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష జరుగుతున్న కేంద్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఓ నిండు గర్భిణీ గ్రూప్- 2 పరీక్షలు రాశారు. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే గర్భిణీ నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రూప్- 2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. ఆదివారం (డిసెంబరు 15న) గ్రూప్ -2 మొదటి రోజు పరీక్షలు రాయగా, సోమవారం (డిసెంబరు 16) గ్రూప్ -2 ఉదయం పేపర్-3 పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెకు మెల్లగా పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ అధికారులు రేవతిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు.
కానీ, ఆమె అందుకు అంగీకరించలేదు. పరీక్ష రాస్తానని గట్టిగా చెప్పారు. రేవతి డెలివరీ తేదీ సోమవారం (డిసెంబరు 16) కావడంతో పరీక్ష కేంద్రంలో సిబ్బందితో సహా అందరూ ఆందోళనకు గురయ్యారు.మధ్యాహ్నం కూడా పరీక్ష రాస్తే గ్రూప్-2 మొత్తం నాలుగు పేపర్లు పూర్తవుతాయి. నాలుగో పేపర్ కూడా రాస్తానని ఆమె పట్టుబట్టారు. అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే గర్భిణీ కోసం పరీక్ష కేంద్రంలో 108 అత్యవసర వాహనాన్ని అందుబాటులో ఉంచారు. పరీక్ష బాగా రాయమని రేవతికి వైద్య సిబ్బంది ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. పరీక్ష పూర్తయ్యే వరకు అందరూ టెన్షన్ పడినా, నాలుగో పేపర్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసి రేవతి బయటికి రావడంతో ఆమెను నేరుగా 108 సిబ్బంది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె బంధువులు, ప్రభుత్వ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆసుపత్రి పాలైన నిరుద్యోగి
సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులో గ్రూప్ 2 పరీక్షకు హాజరైన ఓ నిరుద్యోగి ఆకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరాడు. స్థానిక అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాళాలలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలోకి వెళ్తే.. పుల్కస్ మండలం, లక్ష్మీసాగర్ గ్రామనికి చెందిన ఎల్ నగేశ్ గ్రూప్ 2 కు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్న క్రమంలో ఒక్కసారి మూర్ఛ (ఫిట్స్) వచ్చి నేలకొరిగాడు. ఈ విషయాన్ని గమనించి కంగారుపడిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరీక్ష కేంద్రంలో విధుల్లో ఉన్న ఎస్‌ఐ అసీఫ్ హుటాహుటిన తన భుజాలపై ఆ యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు తీసుకొచ్చి 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.