- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది. యూనివర్సిటీ ఆవరణంలో చిరుత సిసి కెమెరాలో కనిపించడంతో సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. సిసి ఫుటేజీలో పులి సంచరిస్తున్నట్టు జాడలు కనిపించడంతో చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుతను పట్టుకోవాలని విద్యార్థులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతోనే చిరుతలు గ్రామాల్లోకి వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అటవీ విస్తీర్ణం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -