Saturday, February 22, 2025

హయత్ నగర్ లో ప్రైవేటు స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడో తరగతి విద్యార్థి లోహిత్ రెడ్డి  రాత్రి ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఫిజిక్స్ ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో క్లాస్ లీడర్ తో కొట్టించడంతో పాటు ఉపాద్యాయుడు వేధింపులకు గురి చేయడంతో విద్యార్థి మృతి చెందాడని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థి మృతి చెందిన విషయం పోలీసు వారు చెప్తే కానీ తమకు తెలియలేదని ఇప్పటికి కూడా స్కూల్ యాజమాన్యం ఏం జరిగిందో చెప్పట్లేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News