- Advertisement -
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తదితరులు స్వాగతం పలికారు. రాష్ట్రపతి హకీంపేట నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రపతి రేపు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు.
- Advertisement -