బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు ఆసీస్ 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 60 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 245 పరుగుల ఆధిక్యంలో ఉంది. బుమ్రా, ఆకాశ్ దీప్ బౌలింగ్‌కు ఆసీస్ బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఉస్మాన్ ఖావాజా(08), నాథన్ మెక్ స్వీనాయ్(04), మార్నష్ లబుషింగే(01), మిచెల్ మార్ష్(02), స్టివెన్ స్మిత్(04) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(14), అలెక్స్ కారే(14) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 445
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 260