బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత పదేళ్లలో అభివృద్ధి చేయకుండా.. పది నెలల్లో ఎలా చేయాలంటూ మంత్రి బిఆర్ఎస్ ను నిలదీశారు. బిఆర్ఎస్ పాలనలో ఆటో డ్రైవర్లకు ఏమీ చేయలేదని.. ఇప్పుడు మరోసారి ఆటో కార్మికులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే వివేకానందకు నిబంధనలపై అవగాహన ఉందని, ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలన్నారు.
సభలో ఆరోపణలకు ముందు స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలని.. వివేకానంద చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలని చెప్పారు. ఆధారాలు, నోటీసు లేకుండా ఆరోపణలు చేయకూడదన్నారు. బిఆర్ఎస్ గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని.. దానిని తమ ప్రభుత్వం గాడిలో పెడుతూ అభివృద్ధి చేస్తున్నానమని మంత్రి చెప్పారు. అధికారం పోగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేషాలు మారుస్తున్నారుని.. రోజుకో వేషంలో సభకు వస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.