Thursday, December 19, 2024

భూభారతి బిల్లును సభలో ప్రవేశపెట్టిన పొంగులేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధరణితో ఎన్నో సమస్యలు తలెత్తాయని, రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావలసినవి కూడా కోర్టులకు చేరాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూయజమానికి తెలియకుండానే భూమి చేయి దాటిపోయిందని, పేదల ఆవేదన చెప్పుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోపభూయిష్టమైన ఆర్‌ఒఆర్ చట్టం2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. భూభారతి బిల్లును శాసన సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత భరోసా అని ప్రశంసించారు.

సభలో భూభారతి చట్టం ప్రవేశపెట్టామని, గత పాలనలో ఇష్టారాజ్యంగా దోచుకున్నారని, భూములను తిరిగి స్వాధీనం చేసకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం ధరణిని తమ ఇంటి సంస్థగా వాడుకుందని దుయ్యబట్టారు. భూభారతి చట్టం రూపకల్పనలో బిఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, వినోద్ లాంటి వాళ్ల సూచనలు తీసుకున్నామని తెలియజేశారు. ప్రభుత్వ భూములు దోచుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాసన సభలో హరీష్ రావు అభ్యంతరకరమైన పదాలు వాడడంతో గందరగోళం నెలకొంది. సభను అగౌరవ పరిచేలా హరీష్ రావు మాట్లాడారని పొంగులేటి తప్పుబట్టారు. హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News