Thursday, December 19, 2024

కేంద్రం తీరుపై నిరసన.. కాంగ్రెస్ ‘ఛలో రాజ్‌భవన్’ ర్యాలీలో సిఎం రేవంత్..

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదానీ వ్యవహారం, మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో చర్చించాలని డిమాండ్ చేసినా.. పట్టించుకోకపోవడంతో కేంద్ర సర్కార్ తీరుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపిసిసి చీఫ్ దీపా దాస్ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించింది. నెక్లెస్‌ రోడ్‌ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ వరకు కాంగ్రెస్ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించిన కేంద్రం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాతన గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News