ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిఎస్ టెట్) 2024 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. పది రోజుల పాటు 20 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టిజి టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇవిఎన్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత టెట్ పరీక్షకు మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 94,335 దరఖాస్తులు రాగా, పేపర్ 2కు 1,81,438 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన టెట్‌కు 2,86,386 దరఖాస్తులు రాగా, ప్రస్తుత టెట్‌కు 2,75,773 దరఖాస్తులు వచ్చాయి.
టెట్ పరీక్ష షెడ్యూల్
2025 జనవరి 2- పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -1)
2025 జనవరి 2- పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -2)
2025 జనవరి 5- పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -1)
2025 జనవరి 5- పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -2)
2025 జనవరి 8 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -1)
2025 జనవరి 8- పేపర్ 1 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -2)
2025 జనవరి 9- పేపర్ 1 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -1)
2025 జనవరి 9- పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -2)
2025 జనవరి 10- పేపర్ 1 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -1)
2025 జనవరి 10 పేపర్ 1 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -2)
2025 జనవరి 11- పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ -1)
2025 జనవరి 11 పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ 1)
2025 జనవరి 11- పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ 2)
2025 జనవరి 12 పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -1)
2025 జనవరి 12 పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ -2)
2025 జనవరి 18 పేపర్ 1 సోషల్ స్టడీస్ (సెషన్ -1)
2025 జనవరి 18 పేపర్ 1 సోషల్ స్టడీస్ (సెషన్ -2)
2025 జనవరి 19 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ 1)
2025 జనవరి 19 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ 2)
2025 జనవరి 20 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ 1)
2025 జనవరి 19 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ 2)