రాజస్థాన్ లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజిలో బుధవారం సైనికుల శిక్షణ సమయంలో మందుగుండు సామగ్రి పేలి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికులకు శిక్షణ తరగతులు బోధిస్తుండటం పరిపాటి. అయితే శిక్షణలో భాగంగా సైనికులు యుద్ధ ట్యాంకులో మందుగుండు సామగ్రి లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో అశుతోష్ మిశ్రా, జితేంద్ర అనే ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన సైనికుడిని హెలికాప్టర్‌లో చండీగఢ్‌కు తరలించారు. మృతుల్లో ఒకరైన అశుతోష్ మిశ్రా ఉత్తరప్రదేశ్ లోని డియోరియా ప్రాంతానికి చెందిన వారు కాగా, జితేంద్ర స్వస్థలం రాజస్థాన్ లోని దౌసా. వారి మృతదేహాలను సూరత్‌గఢ్ మిలటరీ స్టేషన్‌కు తరలించారు. ఇది ఈ వారంలో రేంజ్‌లో జరిగిన రెండో ప్రమాదంగా సైనికాధికారులు పేర్కొన్నారు. ఆదివారం చంద్ర ప్రకాష్ పటేల్ అనే గన్నర్ తుపాకీని బోయింగ్ వాహనానికి అమరుస్తుండగా వాహనం ఒక్కసారి వెనక్కు జారడంతో తీవ్ర గాయాల పాలై మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు.