Thursday, December 19, 2024

టాప్‌లోనే బుమ్రా

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. అశ్విన్ 890 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. జడేజా కూడా టాప్10లో చోటు నిలబెట్టుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ తిరిగి టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కే చెందిన హ్యారీ బ్రూక్‌ను వెనక్కి నెట్టి రూట్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బ్రూక్ రెండో స్థానానికి పడిపోయాడు. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌లు టాప్10లో కొనసాగుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News