హైదరాబాద్: జగిత్యాల జిల్లా గురుకులంలో మరో విద్యార్థిని పాము కాటు వేసింది. పెద్దాపూర్ గురుకులంలో 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థి స్నానం చేస్తుండగా పాముకాటు వేయడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వెంటనే విద్యార్థిన్ని కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. పామును కర్రలతో కొట్టి చంపారు. పాము కాటుకు గురైన వెంటనే టీచర్లు విద్యార్థి సమాచం ఇచ్చిన కూడా పట్టించుకోకపోవడంతో తన తల్లిదండ్రులకు విద్యార్థి సమాచారం ఇచ్చారు. విద్యార్థి తల్లిదండ్రులు పెద్దాపూర్ గురుకులం చేరుకొని ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు పరీక్షించి పాము కాటేనని నిర్ధారించారు. పెంజర పాము అని తెలియడంతో విషానికి విరుగుడు ఇంజక్షన్ ఇచ్చామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థి చికిత్స తీసుకుంటున్నాడు. పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థులను ఉపాధ్యాయులు పట్టించుకోవడంతో లేదని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పాము కరిచిన విషయం ఉపాధ్యాయులకు విద్యార్థి చెప్పిన కూడా జ్వరం ట్యాబ్లెట్స్ వేసుకోమని సలహా ఇవ్వడం ఏంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో నాలుగు నెలల క్రితం పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.
పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థినికి పాముకాటు… పట్టించుకోని పంతుళ్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -