అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు నిరసనకు దిగారు. అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు, నితీష్ కుమార్ స్పందనేంటో తెలియజేయాలని అంటూ లేఖలో కోరిన కేజ్రీవాల్.
“బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారు. మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారు” అని లేఖలో కేజీవాల్ పేర్కొన్నారు.