- Advertisement -
గాంధీనగర్: పదేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారం చేసి అనంతరం ఆమె మర్మాంగాల్లోకి రాడ్‌ను జొప్పించిన సంఘటన గుజరాత్ రాష్ట్రం భరూచ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జఘదియా ప్రాంతంలో విజయ్ పాశ్వాన్(36) అనే వ్యక్తి తన ఇంటి పక్కన ఉండే బాలికకు మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం బాలికపై విజయ్ అత్యాచారం చేసి అనంతరం మర్మాంగాల్లోకి రాడ్‌ను జొప్పించాడు. అనంతరం నిందితుడు పారిపోయాడు. ఇంటి పక్కను నుంచి ఏడుపు శబ్దాలు వినపడడంతో బాలిక తల్లి ఆమెను గుర్తించి భరూచ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని తెలియడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వడోదరలోని ఎస్‌ఎస్‌జి ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోస్కో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భరూచ్ ఎస్‌పి మయుర్ చౌవ్డా తెలిపాడు.
- Advertisement -