Monday, January 20, 2025

ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చెప్పడంలో హరీష్ రావు దిట్ట: భట్టి ఫైర్

- Advertisement -
- Advertisement -

ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చెప్పడంలో హరీశ్ రావు దిట్ట అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల అప్పు చేశారని హరీష్ రావు ఆరోపిస్తున్నారని.. కానీ, తమ సర్కార్.. ఎఫ్ఆర్ఎంబీకి లోబడి ఈ ఏడాదిలో రూ.52వేల కోట్ల అప్పు మాత్రమే తెచ్చామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బిఆర్ఎస్ సర్కార్ రూ.3 లక్షల కోట్లే అప్పు చేసిందని.. కానీ, కాంగ్రెస్ రూ.7లక్షల కోట్లు అప్పు చేసిందని తప్పుడు ప్రచారం చేశారని హరీశ్ ఆరోపించారు.

దీనిపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత సర్కార్ చేసిన అప్పులతో పాటు పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయని, ఈ రెండు కలిసి మొత్తం రూ.7 లక్షల 10 వేల కోట్ల అప్పు ఉందని చెప్పారు. పదేళ్లు అప్పులు తప్ప.. బిఆర్ఎస్ చేసిందేమి లేదని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.20 వేల 600 కోట్లు రైతు రుణమాఫీ చెల్లించామని చెప్పారు. బిఆర్ఎస్ నాలుగేళ్లు చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని విమర్శించారు. ఇప్పటికే రూ.24 వేల కోట్లకు పైగా మేము అప్పులు తీర్చామని, మార్చి నుంచి ఇప్పటి వరకు మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. అలాగే, రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నామని, మహిళల కోసం మహాలక్ష్మి పథకం అమలు చేశామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ వెళ్తున్నామని డిప్యూటీ సీఎం భట్టీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News