Friday, December 20, 2024

డ్రగ్స్‌తో పట్టుబడ్డ ఫొటొగ్రాఫర్

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 11.5 గ్రాముల కొకైన్, రెండు స్కూటీలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…షార్ట్ ఫిలీం ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న క్రాంతి, హజార్ అదనపు ఆదాయం సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు గోవాలో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశారు.

గోవాలో డ్రగ్స్ విక్రయదారుల నుంచి కొకైన్‌ను గ్రాముకు రూ. 6,000ల చొప్పున కొనుగోలు చేసి తీసుకుని వచ్చి హైదరాబాద్‌లో రూ. 14 వేలకు గ్రాము చొప్పున విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 7లో, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టిఎఫ్ సిఐ బిక్షారెడ్డి, ఎస్సైలు బాలరాజు, సంధ్య, కానిస్టేబుళ్లు మహేశ్వర్, శ్రీనివాసరెడ్డి, సుమ, ప్రసన్న, కౌశిక్, హనిష్, శంకర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News