Monday, December 30, 2024

ఈ పాపం ఎవరిది?

- Advertisement -
- Advertisement -

ఈ పాపం ఎవ రిది… ఎవరు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు.. నవమాసాలు మోసిన తల్లికి కూడా ఆ బిడ్డ ఏడేపు వినపడలేదా… కన్న పేగు బంధం ఎలా కర్కశంగా మారింది… తొమ్మిది నెలలు తన గర్భంలో మోసి కన్న తర్వాత నిర్దాక్షణ్యంగా ఎలా వదిలి వెళ్లారో తెలియదు కానీ.. అప్పుడే పుట్టిన నవజాత శిశువు ఏడుపు మాత్రం అందరికీ వినిపించింది. పొత్తిళ్లలో ఉన్న చంటిబిడ్డ ఇంకా కళ్లు కూడా తెరుచుకోని వైనం..తల్లి ఒడిలో ఉండాల్సిన ఆ బిడ్డ శ్మ శాన వాటికలో ప్రత్యక్షమైంది. తల్లి ఒడి స్పర్శ లేదు.. ఇన్ని రోజులు గర్భంలో ఉన్న ఆ బిడ్డ భూమిమీదకు రా గానే తనను లాలించే తల్లి జాడ లేకపోవడంతో గుక్కప ట్టి ఏడ్చింది.. ఆ చిన్నారి ఏడుపు విన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తోంది… ఎవరికి కాన్పు అయింది…

అసలు ఎటునుంచి ఈ సౌండ్ వినిపిస్తుందని చుట్టుపక్కల వారు గమనించారు. తీరా పక్కనే ఉన్న శ్మశాన వాటికలో నుం చి పిల్లాడి ఏడుపు వినపడటంతో నిర్ఘాంతపోయారు. ఏంటి తెల్లవారు జామున శ్మశాటికలో పిల్లవాడి ఏడుపు వినపడటం ఏంటని అందరూ షాక్ అయ్యారు. ఒక ఉ ండపట్టలేక పరుగులు తీశారు. స్థానిక మహిళలు అక్కడికి చేరుకొని పొత్తిగుడ్డలో చుట్టి ఉన్న ఆ నవజాత శిశువును ఎత్తుకున్నారు. అసలు ఇంతటి దారుణానికి ఒడిగట్టింది ఎవరు… అప్పుడే పుట్టిన పసికందును ఎవరు ఇ లా పడేసి వెళ్లారని అటుఇటూ చూశారు. వెంటనే స్థానిక కౌన్సిలర్‌కు సమాచారం ఇవ్వడంతో, అక్కడి నుంచి వా రు పోలీసులకు సమాచారం అందించారు.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం న్యూ గొల్లగూడెంలోని శ్మశాన వాటికలో నవజాత శిశువు ల భ్యమైంది. శ్మశాన వాటిక వద్ద నుంచి వినిపిస్తున్న ఏడుపుని గమనించిన స్థానికులు అటుగా వెళ్లి చూసే సరికి నవజాత శిశువు తారస పడింది. వెంటనే స్థానిక సీపీఐ నాయకుడికి కబురు చేరవేశారు. స్పందించి నాయకుడు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో క్ష ణాల్లో పోలీసులు నవజాత శిశువు బాలుడిగా గుర్తించారు. అనంతరం రామవరంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. శిశువు ఆ రోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించుకున్న అనంతరం డీసీపీవో ఆధ్వర్యంలో భద్రాచలంలోని శిశు గృహానికి తరలించారు.

నవమాసాలు మోసి పురిటి నొప్పులను అ ధిగమించి శిశువుకు జన్మనిచ్చిన తల్లి భారం అనుకుం దో బాధ్యత మరిచిందో కానీ రోజుల వయస్సున్న పసిగుడ్డు ప్రాణానికి విలువని ఇవ్వకుండా శ్మశాన వాటిక లో వదిలి వెళ్లిపోయిన తీరును తలచుకొని స్థానికులు క ంటనీరు పెట్టారు. ఇటువంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా తల్లి తన పిల్లల పోషణ కోసం నూటికి నూరు పాళ్లు శ్రమిస్తోంది. కానీ ఈ తల్లి తన శిశువు పోషణ భారం అ నుకుందో బాధ్యత మర్చి శ్మశాన కాపరి శివుడికి దత్తత ఇచ్చి చేతులు దులుపుకుందని మరో కొంతమంది మం డిపడుతున్నారు. శ్మశానంలో లభ్యమైన ఈ నవజాత శి శువుని ఎవరు వదిలి వెళ్లిపోయారు, కారకులు ఎవరు అని త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

నవజాత శిశువు తల్లిని గుర్తించిన పోలీసులు
ఎట్టకేలకు త్రీటౌన్ పోలీసులు ఆ శిశువు తల్లిని గుర్తించా రు. స్థానికంగా స్మశాన వాటిక చుట్టుపక్కల ఆ వార్డులో నివసించే వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే అదే వార్డులో గత ఆరు నెలలుగా ఓ యువతి ఇంటి నుంచి బయటికి రావడం లేదని, తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను అసలు గదిలో నుంచి కూ డా బయటకు రానివ్వడం లేదని అన్నారు. అయితే స దరు యువతి మైనర్ అయి ఉంటుందని, గర్భవతి కావడంతో ఎవరికి చెప్పకుండా తల్లిద్రండు లు ఇంట్లోనే ఉంచి ఉంటారని పలువురు చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలో పురిటి నొప్పులు రావడంతో గురువారం తెల్లవారుజామున ఇంట్లోనే ప్రసవం కావ డం, వెంటనే ఆ శిశువును పక్కనే ఉన్న స్మశాన వాటికలో పడేసి ఉంటారని ప లువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా రు. అయితే ఈ కేసుకు సంబంధించి స దరు మైనర్ బాలిక తండ్రిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News