- Advertisement -
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మైనారిటీ గురుకుల పాఠశాలలలో మధ్యాహ్నం భోజనం చేసి 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనారు. కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు.వెంటనే చికిత్స నిమిత్తం ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు . కాగా వారిలో 24 మంది డిశ్చార్జ్ అవ్వగా, మరో 9 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో బోండా, మధ్యాహ్నం చికెన్, సాయంత్రం స్నాక్స్ లో బొప్పాయా తీసుకున్నట్లు సమాచారం.
- Advertisement -