ముంబయి: తాను చెప్పిన ప్రదేశానికి హనీమూన్‌కు వెళ్లలేదని అల్లుడుపై మామ యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థాణే జిల్లాలో జరిగింది. అల్లుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జాకీ గులామ్ ముర్తాజ(65) అనే వ్యక్తి తన కూతురును ఇబాద్ అతీక ఫాల్కేకు(29) ఇచ్చి వివాహం చేశాడు. హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్తామని మామకు అల్లుడు చెప్పాడు.
కశ్మీర్ వద్దు అని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని అల్లుడుకు మామ సూచించాడు. ఈ విషయంలో అల్లుడు, మామ మధ్య ఘర్షణ జరిగింది. బుధవారం రాత్రి అతీక్ కారులో ఇంటికి వచ్చాడు. ఇంటికి సమీపంలో కారు ఆపి ముందుకు వెళ్లబోతుండగా అల్లుడి ముఖంపై మాయ యాసిడ్‌తో దాడి చేశాడు. అతిక్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. మామ ముర్తజా ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సిఐ ఎస్‌ఆర్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.