Saturday, December 21, 2024

ఈ – సిగరెట్ తాగుతున్నారా?

- Advertisement -
- Advertisement -

సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలుసు. కానీ, చాలామంది దీనిని తాగుతూనే ఉంటారు. దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కూడా ఉండవు. అయితే, నేటి కాలంలో ఈ – సిగరెట్ల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఇది వాపింగ్ అని కూడా చాలామందికి తెలుసు.

ఈ – సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి అహానికరం ఉండదని సిగరెట్ తాగే వారు వాదిస్తున్నారు. అయితే ఈ – సిగరెట్ తాగడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది వ్యసనం గా మారితే ఎంతో హానికరం అని అంటున్నారు. ఈ క్రమంలో ఈ – సిగరెట్ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

ఈ – సిగరెట్లు తాగడం గుండెకు చాలా హానికరం. ఇది హార్ట్ బీట్ నీ బలహీనపరుస్తుంది. అంతేకాకుండా వాపింగ్ చేయడం వల్ల ధమనులు గట్టి పడతాయని దానివల్ల పక్షవాతం వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ – సిగరెట్లు తాగడం వల్లకేవలం గుండె మీదనే కాకుండా మెదడుపై చాలా ప్రభావం ఉంటుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. వాపింగ్ కు బానిసలుగా మారిన వ్యక్తులు మెదడులో శ్రద్ధ, అభ్యాసం, మానసిక స్థితి, కోపాన్ని నియంత్రించే భాగాలకు హాని కలిగించవచ్చు. ఇది పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది.

వాపింగ్ అలవాటు పడిన తర్వాత దానికి దూరంగా ఉండడం చాలా కష్టం. దానికి దూరంగా ఉండటమే ఏకైక నివారణ మార్గమని రైతులు చెబుతున్నారు. ఇకపోతే వాపింగ్ క్యాన్సర్ కూడా కారణం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News