Tuesday, January 21, 2025

కెటిఆర్‌కు హైకోర్టులో ఉరట

- Advertisement -
- Advertisement -

తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో డబ్బుల గోల్ మాల్‌పై ఎసిబి నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ ఆయన శుక్రవారం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పది రోజుల వరకూ కెటిఆర్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయా లని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరు వర్గాల న్యాయవాదులు హోరాహోరీగా రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. కెటిఆర్ తరపున సుప్రీంకోర్టు లాయర్ సుందరం వాదించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఈ నిర్ణయం జరిగిందని కెటిఆర్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 నాడు ఫిర్యాదు వస్తే 19 నాడు ఎఫ్‌ఐఆర్ చేశారు. ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండా ఎఫ్‌ఐఆర్ చేశారన్నారు.

ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తు లేదని వాదించారు. 2023 అక్టోబర్‌లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎఫ్‌ఇఒకి చెల్లించారని, అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని కెటిఆర్ తరపు లాయర్ ప్రశ్నించారు. పబ్లిక్ సర్వెంట్ నేర పూరిత దుష్ప్రవర్తన చేస్తే పిసి యాక్ట్ పెట్టాలి, కానీ ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో క్రిమినల్ మిస్ కాండక్ట్ (నేర పూరిత దుష్ప్రవర్తన) ఎక్కడ జరగలేదు. 13(1)ఎ, 409 అనే సెక్షన్‌లు వర్తించవన్నారు. 2024 లో ఖచ్చితంగా నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్‌ఇఒకు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందన్నారు. ప్రాధమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దమని, అఫెన్స్ జరిగిందని తెలిశాక మూడు నెలల లోపే కేసు రిజిస్టర్ చేయాలన్నారు. 11నెలల తర్వాత కేసు నమోదు చేశారు. లలిత కుమార్ వర్సెస్ యూపి కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఈ కేసులో వర్తిస్తుందని తెలిపారు.ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని, సీజన్ 9 లో 110 కోట్ల రూపాయల లాభం వచ్చిందని తెలిపారు. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుంది.

దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగిందని. ఎన్నికల కోడ్ ఉల్లగించారనడానికి ఎలాంటి అధారాలు లేవన్నారు. ప్రొసీజర్ పాటించలేదు అనడం సరైంది కాదన్నారు. ఈ విషయంలో కెటిఆర్ లబ్ది పొందలదన్నారు. ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందని అడ్వకేట్ జనరల్(ఎజి) తెలిపారు. రెండు నెలల క్రితం ఎంఎయుడి చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు చేశారని, విచారణకు గవర్నర్ కూడా అనుమతించారని కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయా అని అడిగిన న్యాయమూర్తికి ఎజి ఆ పత్రాలు అందించారు. ఎఫ్‌ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుందని, ప్రతి విషయం ఎఫ్‌ఐఆర్‌లో ఉండదు. దర్యాప్తులో అనేక విషయాలు బహిర్గతమవుతాయన్నారు. దర్యాప్తులో ఈ కేసులో భాగస్వామ్య లైన వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని, విదేశీ కంపెనీకి ప్రజధనం బదిలీ అయ్యిందని ఎజి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది అత్యవసర పిటిషన్ విచారణ కాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News