‘వన్ నేషన్..వన్ ఎలక్షన్’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంట్ కమిటీలో తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు స్థానం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నియామితులయ్యారు. ముందుగా లోక్ సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఉంటారని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయంలో మార్పులు చేస్తూ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో లోక్ సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఉంటారని ప్రకటించింది. పెరిగిన జేపీసీ సభ్యుల జాబితాలో తెలంగాణ నుంచి డాక్టర్ కే.లక్ష్మణ్ కు స్థానం దక్కింది.
లోక్ సభ నుంచి కొత్తగా బీజేపీ నుంచి వైజయంత్ పండా(ఒడిశా), సంజయ్ జైశ్వాల్(బీహార్), చోటేలాల్ (యూపీ ఎస్పీ), అనిల్ యశ్వంత్ దేశాయ్ (మహారాష్ట్ర, శివసేన యూబీటి), శాంభవి(ఎల్జేపీ రాంవిలాస్ బీహార్), కే.రాధాకృష్ణన్ (కేరళ సీపీఎం)లు ఉన్నారు. దీంతో జేపీసీలో బీజేపీ సభ్యుల సంఖ్య 12కు చేరింది. అటు రాజ్యసభ నుంచి ఘ్యాన్ శ్యామ్ తివారీ, భూభానేశ్వర్ కలిత, కే.లక్ష్మణ్, కవిత పటిదార్, సంజయ్ కుమార్ జా, రణదీప్ సింగ్ సుర్జీవాల, ముకుల్ బాలకృష్ణ వాస్నిక్, సాకేతో గోఖలే, పి.విల్సన్, సంజయ్ సింగ్, మానస్ రంజన్ మంగరాజ్, వి.విజయసాయిరెడ్డిలు ఉన్నారు.