ఈ- కారు రేసింగ్ వ్యవహారంపై చర్చకు
బిఆర్‌ఎస్ పట్టు అధికార, విపక్ష సభ్యుల మధ్య
వాగ్యుద్ధం నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో సభలోకి
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు నినాదాలు చేస్తూ
స్పీకర్ పోడియంవైపు దూసుకెళ్లేందుకు యత్నం
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట
కాగితాలు, వాటర్ బాటిళ్లు విసురుకున్న
ఇరు పార్టీల సభ్యులు గందరగోళం మధ్య సభ
వాయిదా మళ్లీ సమావేశమైనా కుదుటపడని
సభ బిఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఆరో రో జు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానంపై బీఆర్‌ఎస్ నేతలు చర్చకు పట్టుపట్టారు. ఈ ఫార్ములా కార్ రేసింగ్‌పై చర్చ కోసం బీఆర్‌ఎస్ నేత లు వాయిదా తీర్మానం ఇచ్చారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారంటూ నల్ల బ్యాడ్జీలతో బిఆర్‌ఎస్ ఎ మ్మెల్యేలు శాసనసభకు వచ్చారు. 420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్ర శ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చే స్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదా లు చేశారు. ఈ ఫార్ములా- పైన కేసు అక్ర మం అంటూ ప్లకార్డుల ప్రదర్శన, నినాదా లు చేస్తూ దీనిపై ప్రశ్నోత్తరాల్లో చర్చ జరపాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. అ సెంబ్లీ వ్యవహారాల మంత్రి సభలో లేరని, ఆయన వచ్చిన వెంటనే తన ఛాంబర్‌లో చ ర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్ర కటించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై చర్చను ప్రారంభించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్పీకర్ కోరారు.
పొంగులేటి ప్రసంగం ప్రారంభం కాగానే బిఆర్‌ఎస్ సభ్యులు ముందు ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై చ ర్చించాలని పట్టుబట్టి నినాదాలు చేశారు. సభ జరుగుతున్న సమయంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రచ్చ రచ్చ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీట్లలో కూర్చోకుండా ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ సభను పదిహే ను నిముషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ సభ ప్రారంభం కాగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భార తి చట్టంపై ప్రసంగం ప్రారంభించగానే ఫా ర్ములా ఈ-రేసుపై ఎసిబి కేసు నమోదు చే యడం, దీనిలో ఏ-1గా బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేరును చేర్చడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-రేసు అంశంపై చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో తర్వాత నిర్ణయం తీసుకుందామని బిఆర్‌ఎస్ సభ్యులనుద్దేశించి చెప్పారు. ఫార్ములా ఈ-రేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించినదని, భూ భారతి బిల్లు రాష్ట్ర ప్రజలకు చెందినదని వ్యాఖ్యానించారు.
బిజెపి సభ్యులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సభలో మాట్లాడుతున్న సమయంలో మళ్లీ బిఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు బిఆర్‌ఎస్ సభ్యులు యత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో పలువురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు. అదే సమయంలో కొందరు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు చించి బిఆర్‌ఎస్ వైపు విసరడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. స్పీకర్ ఎంత సర్దిచెప్పినా వినకుండా నిబంధనలకు విరుద్ధంగా బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోడియం వైపు దూసుకువచ్చారు. హరీశ్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పోడియం వైపు వెళుతుండగా సభలోని మార్షల్స్ అడ్డుకున్నారు. అయినా వినకుండా బలంగా తోసుకుచ్చారు. ఈ సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్‌ను నెట్టేస్తూ పోడియం దగ్గరకు చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి గాల్లోకి ఎగరేశారు. దీంతో అసెంబ్లీ రణరంగంగా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్, పేపర్లు విసురుకున్నారు. ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొనడంతో సభను మళ్లీ 15 నిమిషాల పాటు అసెంబ్లీ స్పీకర్ వాయిదా వేశారు. కాగా స్పీకర్‌పై బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేపర్ల కట్ట విసిరారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పేపర్లు చింపి విసిరేశారు.
స్పీకర్ పోడియం మెట్లపైకి హరీష్‌రావు వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపునకు దూసుకురావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేయి చూపించి హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్‌ను అవమానించేలా సభలో వ్యవహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించారని, షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్‌ను డిమాండ్ చేశారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని మండిపడ్డారు. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఆసమయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు జోక్యం చేసుకుని నిరసనలు ఉంటే బయట తెలపాలని సూచించారు. సభలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ పరిణామంపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్‌లో పెట్టాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. సభలో జరిగింది పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను తెలియచేస్తోందని విమర్శించారు.
అక్రమ కేసు కాకపోతే సభలో చర్చించాలి : బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు
అంతకుముందు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని, కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బిఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ఈ అంశంపై రకరకాల లీకులు ఇస్తున్నారని, మేం ఎలాంటి తప్పు చేయలేదని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా ఈ-రేసుపై నిర్ణయం తీసుకున్నామన్నారు. మేం తప్పు చేశామంటున్నారని, దీనిపై సభలో చర్చించి ఆ తప్పేంటో చెప్పాలని కోరారు. పెట్టింది అక్రమ కేసు కాకుంటే వెంటనే సభలో చర్చించాలని, మేం తప్పు చేయలేదని కేటీఆర్ చెప్పారని, ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తామని హరీశ్‌రావు అన్నారు.