- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బుళ్ల సముద్రం శివారులో జాతీయ రహదారిపై లారీని మినీ వ్యాన్ ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మినీ వ్యాన్‌లో 14 మంది ఉన్నట్టు సమాచారం. తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు గుడిబండ, అమరాపురం చెందిన వారిగా గుర్తించారు.
- Advertisement -