- Advertisement -
దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద దర్గా వద్ద మిఠాయిల దుకాణంలో డిసిఎం దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -