Sunday, December 22, 2024

బైడెన్ సర్కార్‌కు తప్పిన ‘షట్‌డౌన్’ ముప్పు

- Advertisement -
- Advertisement -

అమెరికా ఫెడరల్ ప్రభుత్వాన్ని నడిపించేందుకు అవసరమైన కీలక ద్రవ్య వినిమయ బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత యుఎస్ కాంగ్రెస్ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఫండింగ్ గడువు ముగిసిన 38 నిమిషాల తరువాత సెనేట్‌లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందింది. డెమోక్రాట్ సభ్యుల సంఖ్య అధికంగా ఉన్న సెనేట్‌లో బిల్లు 8511 వోట్ల తేడాతో ఆమోదం పొందింది. రిపబ్లికన్ల సంఖ్య అధికంగా ఉన్న ప్రతినిధుల సభలో బిల్లుకు ఇది వరకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనితో అమెరికాకు షట్‌డౌన్ గండం తప్పింది. అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పెడితే ఈ బిల్లు చట్టంగా మారిపోతుంది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన ఉద్దీపన ప్యాకేజీ అందుతుంది.

వాస్తవానికి ఈ బిల్లు ఇది వరకే ఆమోదం పొందవలసి ఉన్నది. కానీ, అమెరికా తదుపరి అధ్యక్షునిగా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ బిల్లులో పలు కీలక మార్పులు సూచించారు. దీనితో బిల్లులో మార్పులు చేసి మళ్లీ చట్ట సభ ముందుకు తీసుకురావలసి వచ్చింది. ప్రభుత్వ ఫండిండ్ గడువు ముగిసిపోవడానికి కొన్ని గంటల ముందు స్పీకర్ మైక్ జాన్సన్ ఈ కొత్త బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీనితో ఉత్కంఠ మధ్య బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోద ముద్ర పొందుతుందనే నమ్మకంతో బైడెన్ ప్రభుత్వం ఎటువంటి మధ్యంతర చర్యలూ తీసుకోలేదు. కాగా, షట్‌డౌన్ స్థితి తలెత్తి ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడి ఉండేవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News