Sunday, December 22, 2024

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..ఏడాదిలో 17వ ఘటన

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఐఐటీ జేఈఈకి సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అతడు విజ్ఞాన్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే సదరు విద్యార్థి శుక్రవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఫ్యాన్‌కు యాంటీ హ్యాంగింగ్ డివైజ్ ఉన్నప్పటికీ అది పనిచేయలేదని పేర్కొన్నారు. ఈ సంఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. తాజా సంఘటనతో కలిపి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 17 వ సంఘటన కావడం గమనార్హం. గత ఏడాది ఏకంగా 30 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News