- Advertisement -
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివైనగర్‌కు చెందిన చేనేత కార్మికుడు నక్క శ్రీనివాస్ (41) శనివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, అనారోగ్యం తోడవడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.పోలీసులు కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా సిరిసిల్ల నేతన్నలకు తగిన ఉపాధి కల్పించాలని పలువురు కార్మిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు
- Advertisement -